Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్

  • రవితేజతో తదుపరి సినిమా ఉంటుంది 
  • సాయిధరమ్ తేజ్ తో మంచి స్నేహం 
  • ఆయన కోసం ఓ ఆసక్తికరమైన కథ రెడీ           
'జై లవ కుశ'తో హిట్ ను అందుకున్న బాబీ తన తదుపరి సినిమాలకి సంబంధించిన పనిలో బిజీగా వున్నాడు. రవితేజ కోసం ఒక మంచి కథను సిద్ధం చేశాననీ, త్వరలో తమ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని ఇటీవలే చెప్పాడు. ప్రస్తుతం రవితేజ ఒప్పుకున్న సినిమాలు పూర్తి కాగానే తాము సెట్స్ పైకి వెళ్లడం జరుగుతుందని అన్నాడు.

ఇక సాయిధరమ్ తేజ్ తోను బాబీ ఒక సినిమా చేయనున్నాడనేది తాజా సమాచారం. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. ఒకానొక  సమయంలో తాను పూర్తి నిరాశలో వున్నప్పుడు, తేజు తనకి ఎంతో అండగా నిలిచాడని అన్నాడు. ఆయన ఇచ్చిన భరోసాను తాను ఎప్పటికీ మరిచిపోలేననీ .. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పాడు. తేజు కోసం ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి రెడీ చేశాననీ, ఆయనతో ఆ సినిమా తప్పకుండా చేస్తానని అన్నాడు. ప్రస్తుతం తేజు ఓకే చేసిన ప్రాజెక్టులు పూర్తయ్యాక తమ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.        
bobby
sai dharam tej

More Telugu News